Kamal Haasan: ‘భారతీయుడు 2’ నుంచి ‘తాతా వస్తాడే’ సాంగ్ రిలీజ్!

Bharateeyudu 2

  • శంకర్ సినిమాగా వస్తున్న 'భారతీయుడు 2'
  • కమల్ సరసన కనిపించనున్న కాజల్ 
  • సంగీతాన్ని అందించిన అనిరుధ్ 
  • జులై 12వ తేదీన సినిమా విడుదల 


క‌మ‌ల్ హాస‌న్‌ - డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. ఇదివరకు విడుదల చేసిన 'శౌర' సాంగ్ అందరికీ తెలిసిందే. ఆ పాటతో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.

చైన్నైలో ఈ మధ్యే జరిగిన ఆడియో లాంచ్ వేడుకలో చిత్రయూనిట్ మాట్లాడిన మాటలు, అనిరుధ్ ఇచ్చిన లైవ్ పర్ఫామెన్స్‌లు సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే బీట్‌ను రిలీజ్ చేశారు. మాస్‌కు కిక్కిచ్చేలా 'తాతా వస్తాడే.. అదరగొట్టి పోతాడే' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో సిద్దార్ధ్ వేసిన స్టెప్పులు బాగున్నాయి. ఇక ఈ పాట శంకర్ స్టైల్‌లో ఎంతో గ్రాండియర్‌గా కనిపిస్తోంది. వందల మంది డ్యాన్సర్లతో ఈ పాటను కంపోజ్ చేసినట్టుగా కనిపిస్తోంది.

కాసర్ల శ్యామ్ సాహిత్యం, అరుణ్ కౌండిన్య గాత్రం, అనిరుధ్ బాణీ ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాయి. బాబా భాస్కర్ కొరియోగ్రఫీ, కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు బాగున్నాయి. త్వరలోనే 'భారతీయుడు 2' ట్రైలర్ రాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ క్రమంలో ప్రమోషన్స్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు శంకర్ భారీ ప్లాన్స్ వేసినట్టుగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News