కృతి శెట్టి కెరియర్ కి 'మనమే' హెల్ప్ అయ్యేనా?
- భారీ హిట్ తో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి
- హ్యాట్రిక్ హిట్ తరువాత కొట్టేసిన తేడా
- వరుస ఫ్లాపులతో తగ్గిన అవకాశాలు
- 'మనమే' పైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ
తొలి సినిమాతోనే 100 కోట్లను కొల్లగొట్టిన రికార్డు ఆమె ఖాతాలో ఉంది. ఇక టాలీవుడ్ ను కొంతకాలం పాటు నాన్ స్టాప్ గా దున్నేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తరువాత చేసిన మరో మూడు సినిమాలు ఆమెను అంతే స్పీడ్ తో వెనక్కి నెట్టేశాయి. వరుసగా ఎదురైన పరాజయాలు, ఆ తరువాత రావలసిన ఆఫర్ల దూకుడును తగ్గించాయి.
అలా కొంత గ్యాప్ తీసుకున్న కృతి శెట్టి, మళ్లీ 'మనమే' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె శర్వానంద్ తో కలిసి నటించింది. రేపు థియేటర్లకు ఈ సినిమా రానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సినిమా, ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందనేది చూడాలి.