మనం దేనికీ సిగ్గుపడాల్సిన పనిలేదు.. పార్టీ ఓటమిపై బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్
- 24 ఏళ్లపాటు అధికారంలో ఉండి తొలిసారి పార్టీ ఓడిపోవడంపై స్పందన
- తమ పాలనలో పేదరికం గణనీయంగా తగ్గిందని వెల్లడి
- కొత్తగా ఎన్నికైన 51 మంది ఎమ్మెల్యేలతో సమావేశం
ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో నవీన్ పట్నాయక్ సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేడీ పనిచేస్తూనే ఉంటుందని చెప్పారు. ‘వ్యవసాయం, సాగునీరు, మహిళా సాధికారత విషయంలో మనం తీసుకొచ్చిన మార్పులు రాష్ట్రాన్ని ఈ స్థానంలో నిలిపాయి. అందువల్ల మనం ఇప్పుడు దేనికీ సిగ్గుపడాల్సిన పనిలేదు’ అని పట్నాయక్ వ్యాఖ్యానించారు.
నవీన్ పట్నాయక్ రాజీనామాతో ఒడిశా రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. 2000 సంవత్సరం మార్చి 5న నవీన్ పట్నాయక్ తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఆయన సీఎం పదవి చేపట్టారు. ఈ సమావేశానికి ముందు పట్నాయక్ ను బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ సాహూ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నవీన్ పట్నాయక్ పెద్ద మనసుగల వారని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారని చెప్పారు. ఆయనకు రుణపడి ఉంటామన్నారు.