ట్రాన్స్ జెండర్ పాత్రలో శ్రీవిష్ణు?
- శ్రీవిష్ణు తాజా చిత్రంగా రూపొందుతున్న 'Swag'
- 'రాజరాజ చోర' దర్శకుడితో చేస్తున్న రెండో మూవీ
- 14 గెటప్పులలో కనిపించనున్న హీరో
- ఆయన సరసన సందడి చేయనున్న రీతూ వర్మ
ఈ సినిమాకి హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతకుముందు శ్రీవిష్ణుతో చేసిన 'రాజ రాజ చోర' సినిమాతోనే ఆయన దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్ కావడం వలన ఆయనకి మంచి పేరు వచ్చింది. కొంత గ్యాప్ తరువాత ఆయన శ్రీవిష్ణుతో కలిసి చేస్తున్న సినిమా ఇది. ఇప్పటికే సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.
ఈ సినిమాలో శ్రీవిష్ణు 14 రకాల గెటప్పులలో కనిపించనున్నాడని అంటున్నారు. ట్రాన్స్ జెండర్ గా కూడా ఆయన కనిపించనున్నాడని చెబుతున్నారు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కీలకమైన పాత్రలో కనిపించనుంది.