నా వల్ల విజయ్ దేవరకొండ హర్ట్ అయ్యాడా?: డైరెక్టర్ రవిబాబు
- స్టార్ హీరోలతో చేయకపోవడానికి పెద్ద కారణమంటూ లేదన్న రవిబాబు
- హీరోలను బట్టి కథలు రెడీ చేయనని వెల్లడి
- తన పద్ధతి ఇంతేనని వ్యాఖ్య
"నేను స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోవడానికి పెద్ద కారణమంటూ లేదు. వాళ్లతో చేయదగిన కథలు సెట్ కాలేదంతే. అయినా నేను ఒక కథను రెడీ చేసుకుని, ఆ కథకి తగిన పాత్రలను ఎంచుకుంటాను. హీరోలను బట్టి కథలను రెడీ చేసుకునే అలవాటు నాకు లేదు. సినిమా అనేది ఒక సమష్టి ప్రయత్నం. ఒకరి మాట ఒకరు ఎందుకు వినాలనే ఆలోచనే రాకూడదు" అని అన్నారు.
"విజయ్ దేవరకొండ 'నువ్విలా' సినిమాలో చేశాడు. ఆ సమయంలో ఆయన నా వలన హర్ట్ అయ్యాడని అంటున్నారు. మరి ఆ తరువాత కూడా అతను .. నేను కలిసి పనిచేశాము. అనే మా మధ్య ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేనట్టేగా? యూ ట్యూబ్ లో వచ్చే ఇలాంటి వార్తలను పట్టించుకోవలసిన అవసరం లేదు" అని చెప్పారు.