కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేతబడి వ్యాఖ్యలపై కేరళ మంత్రి బిందు స్పందన
- తనపైనా, సీఎం సిద్ధరామయ్యపైనా చేతబడి జరుగుతోందన్న డీకే శివకుమార్
- కలకలం రేపిన డీకే వ్యాఖ్యలు
- కేరళలో అలాంటి వాటికి చోటు లేదన్న డాక్టర్ ఆర్.బిందు
దీనిపై కేరళ మంత్రి డాక్టర్ ఆర్.బిందు స్పందించారు. దేశంలో ఇంకా కొన్ని చోట్ల ఇలాంటి మూఢాచారాలు కొనసాగుతున్నప్పటికీ, కేరళలో ఇలాంటివి జరగవని, తమ రాష్ట్రంలో అటువంటి కార్యకలాపాలకు చోటు లేదని బిందు స్పష్టం చేశారు. డీకే శివకుమార్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఒకవేళ కేరళలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నాయేమో పరిశీలిస్తామని అన్నారు.