రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు ఉండకూడదన్న సీఎం రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ కౌంటర్
- అశోక చక్రాన్ని మొదట వాడిన నెహ్రూది కూడా రాచరికమేనా? అని ప్రశ్న
- ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన బాల్క సుమన్
- చోళరాజులు తయారు చేసిన సెంగోల్‌ను అధికారిక చిహ్నంగా స్వీకరించారని గుర్తు చేసిన సుమన్
ఈ మేరకు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనాన్ని పొందుపరిచారు. సారనాథ్‌లో అశోక చక్రవర్తి వేసిన స్థూపంలో ఉన్న నాలుగు సింహాలను, అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసింది భారత రాజ్యాంగ సభ, తొలి ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూనే అని ఆ కథనంలో పేర్కొన్నారు. తమిళనాడులో చోళ రాజులు తయారు చేసిన సెంగోల్‌ను అధికారిక చిహ్నంగా స్వీకరించి... పార్లమెంట్ భవనంలో ప్రస్తుత భారత ప్రధాని మోదీ ప్రతిష్ఠించారని ఆ కథనం పేర్కొంది.