పూణె టీనేజర్ డ్రంకెన్ డ్రైవ్ కేసులో మరో మలుపు.. ఇద్దరు వైద్యుల అరెస్ట్
- ఈ నెల 19న తాగి కారు నడుపుతూ ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఢీకొట్టిన టీనేజర్
- వారిద్దరూ అక్కడికక్కడే మృతి
- బాలుడి రక్త నమూనాలు తారుమారు చేసే ప్రయత్నం చేసిన వైద్యులు
- అరెస్ట్ అయిన వారిలో ఒకరు ఫోరెన్సిక్ విభాగం హెడ్.. మరొకరు ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్
- ఇప్పటికే అరెస్ట్ అయిన టీనేజర్ తండ్రి, తాత
ఈ కేసును క్రైంబ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 19న బార్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్న బాలుడు తన ఖరీదైన పోర్షే కారులో తెల్లవారుజామున ఇంటికి వస్తూ బైక్‌పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలో ప్రమాదం జరిగిన 14 గంటల్లోనే నిందితుడైన బాలుడికి బెయిలు మంజూరు చేసిన జువైనల్ కోర్టు.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన విమర్శలతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుని జూన్ 5 వరకు అబ్జర్వేషన్‌కు పంపింది. ఈ కేసులో ఇప్పటికే టీనేజర్ తండ్రి, తాతను పోలీసులు అరెస్ట్ చేశారు.