'త్రినయని' సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- నాలుగు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో త్రినయని నటి పవిత్ర జయరాం మృతి
- అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రకాంత్
- మానసిక కుంగుబాటుతో ఆత్మహత్య
ప్రమాదం తర్వాత మానసిక కుంగుబాటుకు గురైన చంద్రకాంత్ నిన్న మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీలోని అల్కాపూర్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. స్నేహితులు పలుమార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో ఫ్లాట్‌కు వచ్చి చూడగా ఆత్మహత్య విషయం వెలుగు చూసింది. చంద్రకాంత్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ విభేదాల కారణంగా వారికి దూరంగా ఉంటున్నాడు. చంద్రకాంత్ తండ్రి చెన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.