రాహుల్ గాంధీ గారూ! మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా?: కేటీఆర్ ప్రశ్న
- అచ్చంపేటలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణ
- ఇందుకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేసిన ప్రవీణ్ కుమార్
- దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుంటే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని కేటీఆర్ హెచ్చరిక
కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగంతో ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ దాడులు, దుర్భాషల్లో పోలీసులు కూడా భాగస్వాములు కావడం సిగ్గుచేటని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన గూండాలపై, ప్రేక్షకపాత్ర వహించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తాము మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని కేటీఆర్ కూడా తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేశారు. తాము కచ్చితంగా న్యాయాన్ని గెలిపించుకుంటామన్నారు.