'కుబేర' నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ విడుదల
- ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర
- డిఫరెంట్ రోల్ పోషిస్తున్న నాగార్జున
- అదిరిపోయే రేంజిలో నాగ్ ఫస్ట్
వర్షంలో నాగార్జున గొడుగు పట్టుకుని వస్తుండగా, ఓ ఐదొందల నోటు వర్షపు నీటిలో తడిసిపోయి కనిపిస్తుంది. ఆ నోటును నాగ్ తీసుకుంటాడని అందరూ భావించినా, తన జేబులోంచి ఓ ఐదొందల నోటు తీసి అక్కడికి కొద్ది దూరంలో ఉంచి నాగ్ వెళ్లిపోతాడు. ఈ ఒక్క సీన్ తోనే నాగార్జున క్యారెక్టర్ పైనా, సినిమా పైనా ఆసక్తిని అమాంతం పెంచేశారు.
ఈ చిత్రంలో ధనుష్ సరసన రష్మిక మందన్న కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోల్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న కుబేర చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.