ప్రభుదేవా 'ప్రేమికుడు' రీ రిలీజ్ వాయిదా
- సాంకేతిక కారణాలతో రిలీజ్ చేయలేకపోతున్నామన్న నిర్మాత మురళీధర్‌రెడ్డి
- కొన్ని థియేటర్లలో విడుదలైందన్న వార్తలు నిజం కాదని వెల్లడి
- జూన్‌లో విడుదల చేయనున్నట్టు చెప్పిన నిర్మాత
ఈ సినిమా కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న వేళ వరల్డ్ వైడ్ తెలుగు డిస్ట్రిబ్యూటర్ మురళీధర్‌రెడ్డి సినిమా వాయిదా వార్తను ప్రకటించారు. నేడు రీ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడినట్టు తెలిపారు. కొన్ని థియేటర్లలో సినిమా విడుదలైనట్టు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ సినిమా నేడు ఎక్కడా విడుదల కాలేదని, జూన్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. సినిమా రిలీజ్ డేట్‌తో మళ్లీ ఓ ఈవెంట్ నిర్వహిస్తామని, జూన్ నెలలో సినిమాను విడుదల చేస్తామని వివరించారు.