దిల్ రాజు మనసు గెలుచుకున్న విజయ్ దేవరకొండ!
- ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఫ్యామిలీ స్టార్'
- థియేటర్స్ దగ్గర నిరాశపరిచిన ఫలితం
- ఓటీటీలో దూసుకుపోతున్న కంటెంట్
- విజయ్ దేవరకొండతో మరో సినిమాను ప్లాన్ చేసిన దిల్ రాజు
- దర్శకుడిగా రవి కిరణ్ కోలా పేరు తెరపైకి
ఈ నేపథ్యంలో మరోసారి విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. విజయ్ దేవరకొండ తన కమిట్ మెంట్ తో దిల్ రాజు మనసు గెలుచుకోవడం వలన, ఆయనతోనే మరో సినిమా చేయడానికి సన్నాహాలు మొదలెట్టినట్టుగా తెలుస్తోంది.
ఈ సినిమాకి దర్శకుడు రవి కిరణ్ కోలా. గతంలో అతని నుంచి వచ్చిన 'రాజావారు రాణిగారు' మంచి విజయాన్ని అందుకుంది. అతను వినిపించిన కథకు దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి సినిమా పనుల్లో ఉన్నాడు.