తెలంగాణ నెంబర్ ప్లేట్ ఉన్న ఆటోలు బెజవాడలో తిరుగుతాయా?: టీడీపీ నేత పట్టాభిరామ్
- వైసీపీ నేతల ప్రచార వీడియోలో లొసుగులు బయటపెట్టిన పట్టాభిరామ్
- ఫేక్ వీడియోలు సృష్టించడానికి వైసీపీ యూనివర్సిటీ బాగా శిక్షణ ఇస్తుందని ఎద్దేవా
- వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాశ్ పై తీవ్ర విమర్శలు
విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయించానని చెప్పుకుంటూ అవినాశ్ రిలీజ్ చేసిన ప్రచార వీడియో లొసుగులను బయటపెట్టారు. ఈ వీడియోలో భాగంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఓ యువకుడిని తన మిత్రుడు ఆటోలో తీసుకెళుతుండగా నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడడం కనిపిస్తుంది. దీనిపై పట్టాభిరామ్ మాట్లాడుతూ.. ఈ వీడియోలో ఉన్న ఆటో హైదరాబాద్ లో రిజిస్టర్ అయిందని, నెంబర్ ప్లేట్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. తెలంగాణ నెంబర్ ప్లేట్ తో ఉన్న ఆటోలు విజయవాడలో తిరుగుతున్నాయా అని ప్రశ్నించారు. వాస్తవానికి ఆ వీడియో మొత్తం హైదరాబాద్ లోనే తీశారని చెప్పారు. ఇలా ప్రతీదాంట్లోనూ అబద్ధాలు తప్ప అవినాశ్ నిజాలు మాట్లాడరని పట్టాభిరామ్ మండిపడ్డారు.