సుదూర గ్రహంపై జీవం ఉనికి.. కీలక ఆధారం గుర్తించిన జేబ్స్ వెబ్ టెలిస్కోప్
- 124 కాంతి సంవత్సరాల దూరంలో భూమికి రెండున్నర రెట్లు పెద్ద నక్షత్రం గుర్తింపు
- కే2-18బి గా నామకరణం చేసిన నాసా శాస్త్రవేత్తలు
- గంటకు 38 వేల మైళ్ల వేగంతో వెళితే 22 లక్షల సంవత్సరాలు పడుతుందని వెల్లడి
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏం గుర్తించిందంటే..
కే2-18బి నక్షత్రంపై డైమిథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్) వాయువు ఆనవాళ్లను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ వాయువు (గ్యాస్) కేవలం ప్రాణికోటి వల్ల మాత్రమే ఉత్పత్తి అవుతుందని వివరించారు. నిర్జీవ గ్రహాలపై ఈ గ్యాస్ ఉండే అవకాశం లేదన్నారు. వాతావరణంలో మరేరకంగానూ డైమిథైల్ సల్ఫైడ్ ఉత్పత్తయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. కే2-18బి నక్షత్రంపై ఈ గ్యాస్ ఉందని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించడంతో అక్కడ జీవం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. టెలిస్కోప్ అందించిన వివరాలపై మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఎంత దూరంలో ఉందంటే..
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించిన ఈ నక్షత్రం మన భూమి నుంచి చాలా దూరంలో ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు 124 కాంతి సంవత్సరాల దూరంలో కే2-18బి ఉందని పేర్కొన్నారు. వాయేజర్ స్పేస్ క్రాఫ్ట్ వేగం (గంటకు 38 వేల మైళ్ల స్పీడ్) తో వెళితే ఈ నక్షత్రాన్ని చేరుకోవడానికి సుమారు 22 లక్షల సంవత్సరాలు పడుతుందన్నారు.