మీరు ఒక్క మాట అంటే మేం వంద మాటలు అనడానికి సిద్ధంగా ఉన్నాం!: కోమటిరెడ్డికి పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్
- వారి మాటలు నమ్మలేదన్న పాడి కౌశిక్ రెడ్డి
- మేం కేసీఆర్ సైనికుల్లా పని చేస్తామని వ్యాఖ్య
- హరీశ్ రావును చూసి కోమటిరెడ్డి చాలా నేర్చుకోవాలని సూచన
తమ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావును చూసి కోమటిరెడ్డి చాలా నేర్చుకోవాలన్నారు. హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీని నిలదీశారని... అందులో తప్పులేదన్నారు. మీరు ఒక్క మాట అంటే మేం వంద మాటలు అనడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని హెచ్చరించారు.
కేసీఆర్ కోసం తాము ముమ్మాటికి పనోళ్లమే అవుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే హరీశ్ రావుతో తాను రాజీనామా చేయించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.