దాడులకు ఎవరూ భయపడవద్దు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు
- జూపల్లి కృష్ణారావు పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపణ
- కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు రక్షణ లేదని విమర్శ
- నిందితులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... కొల్లాపూర్ ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ గూండాలు బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఈ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు రక్షణ లేదని విమర్శించారు. కొల్లాపూర్ ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అరాచకాలకు అడ్డు, అదుపు లేకుండా పోతున్నాయని మండిపడ్డారు. నిందితులను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడులకు ఎవరు భయపడవద్దని... అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.