నాకు ఏడాదికి ఒకసారి పెళ్లి జరిపిస్తున్నారు: అంజలి
- 18 ఏళ్ల కెరియర్ చూశానన్న అంజలి
- 'గీతాంజలి' మంచి గుర్తింపు తెచ్చిందని వెల్లడి
- తన పెళ్లికి సంబంధించిన పుకార్లపై స్పందన
- తన సినిమా రిలీజ్ సమయంలో ఇలా జరుగుతుందని వ్యాఖ్య
"ఈ కథను నాకు కోన గారు 'నిశ్శబ్దం' సినిమా సమయంలో వినిపించారు. అది వర్కౌట్ కావడానికి ఇంత సమయం పట్టింది. నేను నా కెరియర్ ను మొదలుపెట్టి 18 ఏళ్లు అవుతోంది. ఇక 'గీతాంజలి' నేను చేసిన ఫస్టు లేడీ ఓరియెంటెడ్ సినిమా. నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన మూవీ. ఆ సినిమా చేసిన పదేళ్లకు సీక్వెల్ చేశాను. ఈ పదేళ్లలో నేను చాలా నేర్చుకున్నాను" అని చెప్పారు.
"నా పెళ్లికి సంబంధించిన రూమర్స్ తరచూ షికారు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నాకు ఐదారు పెళ్లిళ్లు చేశారు. ఒకసారి బిజినెస్ మెన్ అంటారు .. మరోసారి ఓ సీనియర్ నిర్మాత అంటారు. ఇలా ఏడాదికి ఒకరితో నా పెళ్లి జరిపిస్తున్నారు. నా ప్రతి సినిమా విడుదలకి ముందు ఇలాంటి ప్రచారం మొదలుకావడం నేను గమనించిన విషయం" అని అన్నారు.