టీఎఫ్‌డీఏకు ప్రభాస్ రూ. 35 లక్షల విరాళం.. వెల్లడించిన దర్శకుడు మారుతి
- మే 4న దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు జయంతి
- అదే రోజు ఎల్బీ స్టేడియంలో తెలుగు ఫిలిం డైరెక్టర్స్ డే
- ఘనంగా నిర్వహించాలంటూ ప్రభాస్ విరాళం
ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు మారుతి ప్రకటించారు. ఈ వేడుక కోసం ఇప్పటికే నటీనటులకు ఆహ్వానాలు అందాయి. ఈ క్రమంలో ప్రభాస్‌ను ఆహ్వానించేందుకు వెళ్లగా వేడుకను ఘనంగా నిర్వహించాలంటూ రూ. 35 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రభాస్ విరాళంపై ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.