ముంబై విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కిన తారక్.. కొత్త లుక్‌లో అదుర్స్!
- బాలీవుడ్ మూవీ 'వార్ 2' షూటింగ్ కోసం ముంబైలో ఎన్‌టీఆర్
- ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన యంగ్ టైగర్
- ఈ క్రమంలో ఆయన ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియో వైరల్
ఇక దేవర సినిమా తర్వాత ఆయన బాలీవుడ్ మూవీ 'వార్ 2'లో నటించనున్నాడు. ఈ చిత్రంతోనే తారక్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు కూడా. ఇందులో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. దాంతో ఇటీవలే ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం తారక్ ముంబైలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ముంబై విమానాశ్రయంలో దిగిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియో బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొత్త లుక్‌లో తారక్ అదుర్స్ అనిపిస్తున్నాడు