మా సోదరుడికి ఓటేస్తే మీకు నీళ్లిస్తామన్న డీకే శివకుమార్‌పై కేసు నమోదు
- బెంగళూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న డీకే సోదరుడు సురేశ్
- ఓ హౌసింగ్ సొసైటీలో ప్రచారం చేసిన డీకే శివకుమార్
- సురేశ్‌ను గెలిపిస్తే మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి
- ప్రలోభాలకు గురి చేసినందుకు కేసు నమోదు
'నేను ఇక్కడికి ఓ బిజినెస్ డీల్ కోసం వచ్చాను. నా సోదరుడు సురేశ్‌ను మీరు గెలిపిస్తే మూడు నెలల్లో మీ ప్రధాన సమస్యను పరిష్కరిస్తాను. కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కేటాయిస్తాం' అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బీజేపీ వీడియోను కూడా విడుదల చేసింది. డీకే శివకుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని... తన సోదరుడి కోసం ఓట్లను దోపిడీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మండిపడింది.
ఈ వ్యాఖ్యలపై చర్చలు తీసుకోవాలని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీనిని పరిశీలించిన ఎన్నికల సంఘం డీకే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లుగా ధ్రువీకరించింది. ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినందుకు ఆయనపై పోలీసు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.