ధనుష్, ఐశ్యర్య ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఉత్తర్వులు
- విడాకులకు దరఖాస్తు చేసుకున్న ధనుష్, ఐశ్వర్య
- అక్టోబర్ 7న వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరుకావాలన్న జడ్జి
- రెండేళ్ల నుంచి విడివిడిగా ఉంటున్న స్టార్ కపుల్
కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పిటిషన్ ను నిన్న జడ్జి సుభాదేవి విచారించారు. అక్టోబర్ 7న ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు రెండేళ్ల నుంచి ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ వేర్వేరుగానే నివసిస్తున్నారు. కుమారులిద్దరూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి ధనుష్ వద్దకు వెళ్లి వస్తుంటారు. 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ధనుష్, ఐశ్యర్య ముగింపు పలకబోతున్నారనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.