ఐఫోన్ లో స్పై వేర్.. భారత కస్టమర్లకు యాపిల్ కంపెనీ అలర్ట్
- కొన్ని ఫోన్లలోకి పెగాసస్ తరహా స్పై వేర్ చేరిందని అనుమానాలు
- భారత్ సహా 91 దేశాలలోని తన కస్టమర్లకు థ్రెట్ నోటీసులు
- గతేడాది అక్టోబర్ లో పెగాసస్ స్పై వేర్ పై ఇదేవిధంగా అలర్ట్ చేసిన కంపెనీ
తాజాగా గురువారం మధ్యాహ్నం పంపిన థ్రెట్ అలర్ట్ లలో భారత్ లోని పలువురు ఐఫోన్ యూజర్లు ఈ స్పై వేర్ బారిన పడినట్లు యాపిల్ పేర్కొంది. మెర్సినరీ స్పై వేర్ గా వ్యవహరిస్తున్న ఈ స్పై వేర్ ఉనికిని గుర్తించినట్లు చెప్పింది. ‘మీ ఫోన్ మెర్సినరీ స్పై వేర్ అటాక్ కు గురైనట్లు గుర్తించాం. మీ ఐడీ సహా మా దగ్గర ఉన్న మీ వివరాల ఆధారంగా ఈ విషయం తెలిసింది. మీ వృత్తి కారణంగానే మిమ్మల్ని టార్గెట్ చేసుకుని ఈ స్పై వేర్ అటాక్ జరిగింది. సాధారణంగా ఇలాంటి స్పై వేర్ అటాక్ ల గుర్తింపు, నిర్ధారణపై వందకు వంద శాతం గ్యారంటీ ఉండదు. అయితే, మీ ఫోన్ అటాక్ కు గురైందనే విషయంలో పూర్తి క్లారిటీతోనే మేము ఈ నోటీసులు పంపుతున్నాం. అందువల్ల ఈ నోటీసులను సీరియస్ గా తీసుకోండి’ అంటూ యాపిల్ తన నోటీసులలో పేర్కొంది.