హార్దిక్ పాండ్యా సోదరులను మోసగించిన కేసులో వారి సవతి సోదరుడి అరెస్ట్
- సవతి సోదరుడు వైభవ్ పాండ్యాతో కలిసి 2021లో పాలిమర్ వ్యాపారాన్ని ప్రారంభించిన హార్దిక్ సోదరులు
- భాగస్వామ్య ఒప్పందాన్ని ఉల్లంఘించి వారికి తెలియకుండా మరో కంపెనీ పెట్టుకున్న వైభవ్
- తొలి కంపెనీలో తన వాటాను 20 శాతం నుంచి 33.3 శాతానికి పెంచుకున్న వైనం
- కంపెనీ ఖాతాల నుంచి లక్షల రూపాయల దారి మళ్లింపు
- రూ. 4.3 కోట్లు నష్టపోయామంటూ పోలీసులకు హార్దిక్ సోదరుల ఫిర్యాదు
తెలియకుండానే మరో కంపెనీ
భాగస్వాములుగా ఉన్న హార్దిక్‌పాండ్యా సోదరులకు తెలియకుండా వైభవ్ అలాంటి కంపెనీనే మరోటి ప్రారంభించాడు. ఈ క్రమంలో తొలి కంపెనీలో లాభాలు గణనీయంగా పడిపోయాయి. దాదాపు రూ. 3 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు, కంపెనీలో తనకున్న 20 శాతం వాటాను రహస్యంగా 33.3 శాతానికి పెంచుకున్నాడు. భాగస్వామ్య కంపెనీ నుంచి చెప్పాపెట్టకుండా లక్షల రూపాయలు దారిమళ్లించడంతోపాటు, కంపెనీ ఖాతా నుంచి కోటి రూపాయలు తన జేబులో వేసుకున్నాడు. ఈ క్రమంలో వారిమధ్య వాగ్వివాదం జరిగింది. హార్దిక్ సోదరులను తీవ్రంగా హెచ్చరించిన వైభవ్.. వారి ప్రతిష్ఠను మంటగలిపేస్తానని హెచ్చరించాడు. దీంతోవారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వైభవ్ పాండ్యాను అరెస్ట్ చేశారు.