చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: వైఎస్ అవినాశ్ రెడ్డి
- అవ్వాతాతల పెన్షన్లను చంద్రబాబు అడ్డుకున్నారన్న అవినాశ్
- ఇంటికో ఉద్యోగం అన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శ
- రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారని ఎద్దేవా
కూటమి పేరుతో ఇతర పార్టీలను కూడగట్టుకుని చంద్రబాబు వస్తున్నారని అవినాశ్ అన్నారు. 2014లో బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారని... అప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో రైతు రుణమాఫీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం అన్న హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు. రంగురంగుల మేనిఫెస్టోతో ఇప్పుడు ఎన్నికలకు వస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.