చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న రఘురామకృష్ణరాజు.. ఉండి నుంచి పోటీ?
- శుక్రవారం టీడీపీలో చేరనున్న రఘురాజు
- ఈరోజు భీమవరం వెళ్తున్న నర్సాపురం ఎంపీ
- మంగళవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయిన రఘురాజు
తాజాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో రఘురాజుకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పినట్టు సమాచారం. ఉండి నియోజకవర్గం నుంచి రఘురాజును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో రఘురాజు చేరనున్నట్టు సమచారం. ఈరోజు రఘురాజు భీమవరం వెళ్తున్నారు. ఈ సందర్భంగా భీమవరం, ఉండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.