కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్‌పై బాల్క సుమన్ తీవ్ర విమర్శలు
- వివేక్ కుటుంబం పెద్దపల్లిలో సామ్రాజ్యవాద విస్తరణకు కుట్రలు చేస్తోందని ఆరోపణ
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోయిందని విమర్శ
- ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న బాల్క సుమన్
వ్యాపారాలు, పదవులు, ఆస్తులు కాపాడుకోవడానికి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లిని ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి వివేక్‌కు సామంత రాజ్యమేమీ కాదన్నారు. వేలకోట్ల ఆస్తులున్న వివేక్ కి దమ్ముంటే జనరల్ సీట్లలో పోటీ చేయాలని సవాల్ చేశారు. పెద్దపల్లి ప్రాంత దళిత సామాజిక వర్గాలను వివేక్ కుటుంబం అణగదొక్కుతోందన్నారు.