కమ్యూనిస్టుల మద్దతు కావాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- కరీంనగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరిన పొన్నం
- ఇంకా 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన కాంగ్రెస్
- ఒక స్థానాన్ని తమకు కేటాయించాలని కోరుతున్న సీపీఐ
గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా కొత్తగూడెం అసెంబ్లీ సీటును సీపీఐకి కేటాయించగా... ఆ పార్టీ తరపున కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా పొత్తు ధర్మంలో భాగంగా ఒక ఎంపీ సీటును కేటాయించాలని కాంగ్రెస్ ను సీపీఐ కోరుతోంది. వరంగల్, కరీంనగర్ స్థానాల్లో ఏదో ఒక స్థానాన్ని ఇవ్వాలని అడుగుతోంది. ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పొన్నం ట్వీట్ పై కమ్యూనిస్టులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.