నిజామాబాద్ నుంచి జీవన్‌రెడ్డి.. భువనగిరి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి.. కాంగ్రెస్ తాజా జాబితా!
- మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగణ
- మెదక్ నుంచి నీలం మధు బరిలోకి
- పెడింగ్‌లో మరో నాలుగు స్థానాలు
బుధవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సీఈసీ సమావేశమైంది. అనంతరం దేశవ్యాప్తంగా 14 స్థానాలతో 8వ జాబితాను ప్రకటించింది. ఇందులో తెలంగాణలోని నాలుగు స్థానాలతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ స్థానాలు కూడా ఉన్నాయి. కాగా, భువనగిరి నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తనను కోరినా అంగీకరించలేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తెలిపారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన చూసి కేటీఆర్ వణుకుతున్నారని పేర్కొన్నారు. మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత.. తాను నేరం చేయలేదని ఒక్కసారి కూడా చెప్పలేదని అన్నారు.