హీరోయిన్ అదితీరావు హైదరీని పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్
- చాలా కాలంగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్, అదితి
- వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాయకస్వామి ఆలయంలో వివాహం
- అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు
సిద్ధార్థ్, అదితి చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పలు సందర్భంగా వీరిద్దరూ కెమెరా కంటికి చిక్కారు. 'మహా సముద్రం' సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శర్వానంద్ పెళ్లికి కూడా వీరిద్దరూ కలిసే వెళ్లారు.