రామ్ చరణ్ బర్త్ డే.. బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించనున్న దిల్ రాజు
- ఈ నెల 27న చరణ్ బర్త్ డే
- రేపు ఉదయం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన శిబిరం ప్రారంభం
- చరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్
సినిమాల విషయానికి వస్తే... చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా... దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ లుక్ కు, టైటిల్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాబోతోందని మేకర్స్ ప్రకటించారు.