ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మీనారాయణ
- గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైన సీబీఐ మాజీ జేడీ
- 2019లో జనసేన అభ్యర్థిగా పోటీ
- ఇటీవల సొంతంగా పార్టీ పెట్టిన లక్ష్మీనారాయణ
- ఈసారి విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ
ఇవాళ విశాఖ ఎంవీపీ కాలనీలో తమ పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో తృతీయ ప్రత్యామ్నాయం కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇటీవల జై భారత్ పార్టీ సహా 8 పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైంది. ఈ కూటమికి లక్ష్మీనారాయణ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, జై భారత్ పార్టీకి ఎన్నికల సంఘం టార్చ్ లైట్ గుర్తును కేటాయించడం తెలిసిందే.