బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్‌ను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి
- ఇటీవల మర్రి రాజశేఖరరెడ్డి కాలేజీ భవనాలను కూల్చివేసిన అధికారులు
- కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారనే వాదనలు
- తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో డీకే శివకుమార్ వద్దకు మల్లారెడ్డి?
మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. పార్టీలో చేర్చుకునే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో ఆయన కర్ణాటక నేత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. తాను పార్టీ మారేది లేదని ఇటీవలే మల్లారెడ్డి స్పష్టం చేశారు. అంతలోనే బెంగళూరుకు వెళ్లి మరీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.