బీఎస్పీ-బీఆర్ఎస్ పొత్తుకు మాయావతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- బీఆర్ఎస్ ప్రస్తుతం ఏ కూటమిలోనూ లేకపోవడంతో అనుమతిచ్చారని వెల్లడి
- ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసిన బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు
- మాయావతి దూతగా తదుపరి చర్చలకు హాజరుకానున్న పార్టీ కేంద్ర సమన్వయకర్త రాంజీ
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూటమిలోనూ లేనందున వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కలసి పనిచేయడానికి అనుమతించారని వివరించారు. ఈ మేరకు బీఎస్పీ హైకమాండ్ సమాచారం అందించిందని చెప్పారు. పొత్తు విషయంలో త్వరలోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో తదుపరి చర్చలు జరగనున్నాయని, ఈ చర్చలకు మాయావతి దూతగా బీఎస్పీ ఎంపీ, పార్టీ కేంద్ర సమన్వయకర్త రాంజీ హాజరుకానున్నరని వెల్లడించారు.