రజాకార్ విడుదల ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్
- ఈ నెల 15న విడుదల కానున్న 'రజాకార్' చిత్రం
- 6 భాషల్లో విడుదలవుతున్న సినిమా
- విడుదలను ఆపేయాలని కోరుతూ ఏపీసీఆర్ పిటిషన్
మరోవైపు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) ఈ పిటిషన్ వేసింది. ఈ నెల 11న ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఈ సందర్భంగా ఏపీసీఆర్ కార్యదర్శి నదీమ్ ఖాన్ మాట్లాడుతూ... పౌర హక్కులను పరిరక్షించడానికి, మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికే తాము పిటిషన్ వేశామని చెప్పారు. మరోవైపు దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, రజాకార్ల అరాచకాలు, ఈ గడ్డ కోసం పోరాడిన వారి చరిత్ర చెప్పడానికే ఈ సినిమా తీశామని తెలిపారు.