ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్... వరంగల్ లోక్ సభకు పోటీ
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఏ పాల్
- రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేస్తారని ప్రకటన
- ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్
తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్... చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.