చెబితే వినిపించుకోనివాడే వర్మ: కోన వెంకట్
- వర్మ వైరాగ్యంతో ఉన్నాడన్న కోన వెంకట్
- ఎవరు చెప్పినా వినిపించుకోడని వ్యాఖ్య
- తనది తప్పని ఒప్పుకోడని వెల్లడి
- తన కెరియర్ లో వర్మ చూడనిది లేదని వివరణ
" కొన్నేళ్ల పాటు సంసారం చేసిన తరువాత, జీవితం పట్ల వైరాగ్యంతో సన్యాసం తీసుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. వర్మ ఒక దర్శకుడిగా తానేమిటనేది ఈ ప్రపంచానికి చూపించాడు. డబ్బు .. కీర్తి ప్రతిష్ఠలు అన్నీ చూసేశాడు. ఇక ఇప్పుడు ఆయున చేసిన సినిమాలు చూస్తుంటే, సినిమాల పట్ల ఆయన వైరాగ్యంతో ఉన్నాడేమోనని అనిపిస్తోంది" అన్నారు.
"వర్మ తాను చేస్తున్నది తప్పని ఎప్పుడూ అనుకోడు. ఎవరైనా చెప్పినా వినిపించుకోడు. అసలు చెప్పింది వినిపించుకోనివాడిపేరే వర్మ. పదిమందికి నచ్చే సినిమా కాదు .. నాకు నచ్చిన సినిమా తీస్తాను .. నచ్చితే చూడండి .. లేకపోతే లేదు అనే ఒక ఫిలాసఫీలోకి ఆయన వెళ్లిపోయాడు. తనకి నచ్చినట్టుగా బ్రతకడం తెలిసిన ఏకైక జీవినే ... ఆర్జీవీ' అనే అభిప్రాయాన్ని వెంకట్ వ్యక్తం చేశారు.