స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్థూపాన్ని ఆవిష్కరించిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్
- మూడు రాష్ట్రాల ప్రజలను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్
- కుప్పం నియోజకవర్గంలోని కాకర్లవంకలో ఏర్పాటు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు
స్మారకంపై వీరప్పన్ చిత్రపటంతోపాటు జెండాను కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న భరత్ ఈ స్తూపాన్ని ఆవిష్కరించి ఫొటోలకు పోజిచ్చారు. కాగా, వచ్చే ఎన్నికల్లో భరత్ కుప్పం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నారు. వీరప్పన్ స్మారకాన్ని ఎమ్మెల్సీ ఆవిష్కరించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.