రేణుకా చౌదరి అనుచరుడిపై కత్తులతో దుండగుల దాడి
- బుధవారం అర్ధరాత్రి కొణిజర్ల గ్రామంలో ఘటన
- సూరంపల్లి రామారావు పరిస్థితి సీరియస్
- ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్న వైద్యులు
స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రామారావు తన ఇంటి ఆవరణలోని బాత్ రూమ్ కు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాసిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో రామారావు తీవ్రంగా గాయపడ్డారు. రామారావు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రాగా.. దుండగులు పారిపోయారు. రామారావును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భూవివాదాలు, పాత కక్షల వల్లే ఈ దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. కటుుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొణిజర్లలో 144 సెక్షన్ విధించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.