రేవంత్ రెడ్డిని దించాలనే ప్రయత్నంతో పొన్నం అలా చేస్తున్నారేమో: బండి సంజయ్
- శాంతిభద్రతల సమస్యను సృష్టించి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నాలు కావొచ్చన్న బండి సంజయ్
- అమ్మను అనేంత సంస్కారహీనుడిని కాదన్న బండి సంజయ్
- కరీంనగర్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్
పొన్నం ప్రభాకర్‌కైనా, తనకైనా అమ్మ అమ్మేనని... అలాంటి అమ్మను అనేంత సంస్కారహీనుడిని తాను కాదన్నారు. తమకు బీజేపీ సంస్కారం నేర్పిందన్నారు. కానీ పొన్నం ప్రభాకర్ తల్లి పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్నాడని ఆరోపించారు. పొన్నం తీరుతో ఆయన తల్లి కూడా బాధపడుతుందని అన్నారు. ఆయన తండ్రి ఆత్మ కూడా బాధపడుతుందన్నారు.
పొన్నంకు బండి సంజయ్ సవాల్
రానున్న లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తాను గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం అందుకు సిద్ధమేనా? అని సవాల్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలను పొన్నం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శ్రీరాముడిని ఎవరైనా అంటే కచ్చితంగా తాము కౌంటర్ ఇస్తామని స్పష్టం చేశారు.