ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
- అవుటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
- ఘటన స్థలిలోనే మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత
- నందిత కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
లాస్య నందిత మృతి ఘటనపై కేసు నమోదు
సుల్తాన్ పూర్ వద్ద ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మృతి ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జరిగిందని పటాన్ చెరు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పటాన్ చెరు వద్ద ఓఆర్ఆర్ నుంచి వెలుపలికి వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు.