అలాంటి పరిస్థితి నాకు ఎప్పుడూ ఎదురుకాలేదు: నటి సత్యకృష్ణన్
- తమ ఫ్యామిలీలో సినిమాల వైపు వచ్చింది తానేనన్న సత్యకృష్ణన్
- వివాహమయ్యాక ఎవరూ అభ్యంతరం పెట్టలేదని వెల్లడి
- ఎవరి పరిధిలో వారు వుంటే సమస్యలు ఉండవని వ్యాఖ్య
మా ఫ్యామిలీలో అంతా జాబ్ చేసేవారే. సినిమా వైపుగా వచ్చింది నేను మాత్రమే. మా వారిది తమిళ ఫ్యామిలీ. వివాహమైన తరువాత సినిమాలు చేయడానికి ఎవరూ అభ్యంతర పెట్టలేదు. కెరియర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి .. అయినా వాటిని తట్టుకుని నిలబడ్డాను. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను మాత్రమే చేస్తూ వెళుతున్నాను" అని చెప్పారు.
"సినిమా ఇండస్ట్రీలో లేడీస్ ఫేస్ చేసే సమస్యలు ఎక్కువనే టాక్ ఉంది. అవి అన్ని చోట్లా ఉండేవే. కాకపోతే సినిమా అనేసరికి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అందువలన ఇక్కడి విషయాలు హైలైట్ అవుతూ ఉంటాయి. ఎవరి పరిధిలో వారు ఉంటే ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉండవు. నేను అలాగే ఉంటాను. అందువలన ఇక్కడ నాకు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు" అని అన్నారు.