టీడీపీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్
- పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ లేఖ రాసిన చంద్రదేవ్
- బీజేపీతో పొత్తు కోసం టీడీపీ సంప్రదింపులు జరపడాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ లేఖలో వివరణ
- గత ఎన్నికల్లో అరకు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఢిల్లీకే పరిమితమయ్యారు. ఎన్డీయేలో టీడీపీ చేరిక విషయంపై ఇటీవలే అమిత్ షా, చంద్రబాబు మధ్య కీలకమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో కిశోర్ చంద్రదేవ్ రాజీనామా చేయడం గమనార్హం.