'హనుమాన్' సీక్వెల్ 'జై హనుమాన్' హీరోగా కేజీఎఫ్ స్టార్ యష్?
- ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన 'హనుమాన్'
- బాక్సాఫీస్ ను షేక్ చేసిన 'హనుమాన్'
- ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'జై హనుమాన్'
మరోవైపు, ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సీక్వెల్ లో హనుమాన్ హీరోగా ఉంటాడని... ఈ పాత్రను ఓ స్టార్ హీరో పోషిస్తారని ఆయన తెలిపారు. దీంతో, ఈ పాత్రకు రానాను తీసుకుంటారని ప్రేక్షకులు ఆల్ మోస్ట్ డిసైడ్ అయ్యారు. అయితే, ఈ పాత్రకు కన్నడ స్టార్, కేజీఎఫ్ హీరో యష్ ని తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారని తాజా సమాచారం. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యష్ నటిస్తే... ఈ చిత్రం మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది సీక్వెల్ విడుదలవుతుందని ప్రశాంత్ వర్మ తెలిపారు.