టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. పవన్ కోసం నేను గెలుస్తా: హైపర్ ఆది
- ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు హింట్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్
- పవన్ సిద్ధాంతాలు నచ్చి ఆయనతో నడుస్తున్నానన్న హైపర్ ఆది
- రోజాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టీకరణ
- ఈసారి కూడా జనసేన కోసం ప్రచారం చేస్తానన్న ఆది
తాను పవన్ కల్యాణ్ అభిమానినని, సిద్ధాంతాలు నచ్చి ఆయనతో కలిసి నడుస్తున్నట్టు చెప్పాడు. పవన్ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించరని, సమస్యల గురించి మాత్రమే ఆయన మాట్లాడతారని పేర్కొన్నాడు. ఆయనను ఎవరైనా ఏమైనా అంటే తాను స్పందిస్తానని పేర్కొన్నాడు. పదవులు, టికెట్లు ఆశించి తాను జనసేనకు మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశాడు. ఒకవేళ తనకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మాత్రం తప్పకుండా పోటీ చేస్తానని తెలిపాడు. పవన్‌ను గెలిపించడం కోసం తాను గెలుస్తానని పేర్కొన్నాడు. ఈసారి కూడా జనసేన తరపున ప్రచారం చేస్తానని హైపర్ ఆది వివరించాడు.