తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయలేరు: నిరంజన్ రెడ్డి
- తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్న నిరంజన్ రెడ్డి
- ఆయన ఆనవాళ్లు చెరపడం మీ వల్ల కాదని వ్యాఖ్య
- తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా... ఢిల్లీకి వెళ్లినా కేసీఆర్ అనే లెజెండ్ ఆనవాళ్లు ఉంటాయని వ్యాఖ్య
- భగత్ సింగ్, నేతాజీ, పటేల్ ఆనవాళ్లు చెరిపివేయలేకపోయారన్న మాజీ మంత్రి
కాంగ్రెస్ పార్టీ ఎంత చెరిపేయాలనుకున్నప్పటికీ భగత్ సింగ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్, అంబేద్కర్, పీవీ నరసింహారావు వంటి వారి ఆనవాళ్లు చెరిపేయలేకపోయారన్నారు. అలాగే గాంధీ, నెహ్రూ ఆనవాళ్లు 75 సంవత్సరాలైనా ఎవరూ చెరిపి వేయలేకపోయారన్నారు. అలాగే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేయడం కాంగ్రెస్ తరం కాదన్నారు.