ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో పాల్గొన్నాను: లక్ష్మీనారాయణ
- ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిన్న ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద ధర్నా
- రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
- హాజరైన పలువురు నేతలు
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో చేపట్టిన ధర్నాలో తాను కూడా పాల్గొన్నానని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల డిమాండ్ ల అమలుకు చర్యలు తీసుకునేలా గవర్నర్ ను డిమాండ్ చేస్తున్నామని, ఆ మేరకు వినతిపత్రం సమర్పించామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన సదస్సులోనూ పాల్గొన్నానని లక్ష్మీనారాయణ వివరించారు.
కాగా, ఢిల్లీలో నిర్వహించిన ధర్నాలో చలసాని శ్రీనివాస్, సీపీఐ రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తదితర నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మద్దతు పలికారు.