ఓటీటీ తెరపైకి వచ్చేస్తున్న 'అయలాన్'
- జనవరి 12న విడుదలైన 'అయలాన్'
- ఏలియన్ నేపథ్యంలో నడిచే కథ
- శివకార్తికేయన్ జోడీకట్టిన రకుల్ ప్రీత్
- తమిళనాట హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ
- ఈ నెల 9 నుంచి సన్ నెక్స్ట్ లో
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగులోను సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ కానుంది. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శివకార్తికేయన్ సరసన రకుల్ నటించింది. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చడం విశేషం.
ఈ సినిమాలో హీరో ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందినవాడు. అతనికి మూగజీవాలంటే ఎంతో ప్రేమ. సేంద్రియ ఎరువులతో పంట పండించే అతనికి నష్టాలే మిగులుతాయి. దాంతో బ్రతకడం కోసం అతను పట్నం వెళతాడు. ఒక కారణంగా భూమి మీదకి వచ్చిన ఒక ఏలియన్ తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. ఫలితంగా ఏం జరుగుతుందనేదే కథ.