వివాహబంధానికి ముగింపు పలికిన నటి హేమమాలిని కుమార్తె
- తన మాజీ భర్త భరత్ తఖ్తానీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల
- పరస్పర అంగీకారంతో స్నేహపూర్వకంగా విడిపోతున్నట్టు వెల్లడి
- ప్రస్తుతం తమ బిడ్డల భవిష్యత్తే ముఖ్యమని స్పష్టీకరణ
- ఈ క్లిష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలంటూ విజ్ఞప్తి
నటి హేమమాలిని, ధర్మేంద్ర కుమార్తె ఈషా డియోల్ 2002లో ‘కోయి మేరే దిల్ సే పూఛే’ మూవీతో సినీ ప్రపంచంలో అడుగుపెట్టారు. ఆ తరువాత పలు హిట్ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ తరువాత నటన నుంచి విరామం తీసుకున్న ఆమె 2012లో భరత్ తఖ్తానీని అనే వ్యాపారవేత్తను వివాహమాడారు. వారికి మిరాయా, రాధ్యా అనే కూతుళ్లు ఉన్నారు. వివాహం, పిల్లల కారణంగా కొంత కాలం నటన నుంచి బ్రేక్ తీసుకున్న ఆమె.. ‘కేక్‌వాక్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో మళ్లీ తెరంగేట్రం చేశారు.