TS నుంచి TGకి మార్పు... వారు మార్చుకోవాల్సిన అవసరం లేదన్న మంత్రి పొన్నం
- తెలంగాణ ఏర్పడిన తర్వాత పాత వాహనాలకు 'ఏపీ' పేరు అలాగే ఉందన్న మంత్రి పొన్నం
- కొత్త వాహనాలు మాత్రమే టీజీగా రిజిస్ట్రేషన్ అవుతాయని స్పష్టీకరణ
- బీసీ కులగణన చేపడతామన్న పొన్నం ప్రభాకర్
- రిజర్వేషన్లు 50 శాతం దాటినా అమలు చేస్తామని వెల్లడి
ఈ సందర్భంగా మాట్లాడుతూ... రిజర్వేషన్లు 50 శాతం దాటినా అమలు చేస్తామన్నారు. బీసీ కులగణనకు మంత్రివర్గం ఆమోదించిందని... అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత తీసుకు వస్తామన్నారు. మేధావులతో చర్చించి బీసీ కులగణన చేపడతామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందా? తర్వాత? అనే అంశంపై చర్చ అవసరం లేదని.. సాధ్యమైనంత త్వరగా కులగణన చేపడతామని వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరమని వ్యాఖ్యానించారు. ఇది తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. ఈ ఆలోచనను బీజేపీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు.
తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలోను, అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని తేల్చి చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటినా అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లు, వివిధ పథకాలకు నిధులు కేటాయించాలంటే బీసీ కులగణన అవసరమని అభిప్రాయపడ్డారు. పదేళ్ల పాలనలో ప్రజలను, రాష్ట్రాన్ని పట్టించుకోని నేతలు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఈ అంశంపై చిత్తశుద్ధి లేని ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు.